Home

»

Latest News

డ్రాగన్ పై పూర్తి క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్: ఫ్యాన్స్ లో హుషారు!

Nov 4, 2026 11:47AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వన్ మాన్ షో డ్రాగన్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఫ్యాన్స్ అయితే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ డైలీ టీజర్ ని చూస్తూ ఎన్టీఆర్ క్యారక్టర్ డిజైన్ ని పలురకాలుగా ఊహించుకుంటూ వస్తున్నారు. ఇక డ్రాగన్ కి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారని, అందులో ఒకరు రవి బసూర్ కాగా ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ సాస్వత్ సచ్ దేవ్ కూడా ఉన్నాడనే న్యూస్ వచ్చింది 


ఈ నేపథ్యంలో స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో నిర్వహించిన క్యూ అండ్ ఏ (Q&A) సెషన్‌లో ఈ సస్పెన్స్‌కి  తెరదించారు. రవి బస్రూర్ మాత్రమే ఈ భారీ ప్రాజెక్ట్‌కి  సంగీతం అందిస్తున్నట్లు  అధికారికంగా స్పష్టం చేశారు. 'ది వన్ అండ్ ఓన్లీ రవి బస్రూర్ సర్' అంటూ చెప్పాడు. దీంతో రూమర్స్ మరో న్యూస్ పై తమ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి.

 

ఇది కూడా చదవండి: సూర్య సినిమాకి నో చెప్పిన క్రేజీ బ్యూటీ: ఫ్యాన్స్ షాక్!

 

 మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీ నుంచే షూటింగ్ స్టార్ట్ చేసింది. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓపియం (Opium) వార్ నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే  డ్రాగన్ లో బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్ కీ రోల్ తో పాటు రుక్మిణి వసంత్ హీరోయిన్. 

 

 

[Prashanth Neel About Dragon, NTR Dragon Music Director, Prashanth Neel, Ravi Basrur music director, NTR Dragon release date, Tollywood movie updates, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com